
కనీవినీ తీరని నష్టం…
సిరా న్యూస్,చెన్నై; తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ప్రధానంగా.. దక్షిణ తమిళనాడులోని నాలుగు జిల్లాలు వరదలతో వణికిపోయాయి. అయితే.. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద విలయం కొనసాగుతోంది. వరద తగ్గినప్పటికీ.. బురద మాత్రం బాధితులను భయపెడుతోంది. అటు.. వరదల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న సీఎం స్టాలిన్.. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వర్ష బీభత్సం, వరద కారణంగా తమిళనాడులోని తిరనల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.ముఖ్యంగా.. తామ్రపర్ణి నది ఉధృతంగా ప్రవహించడంతో ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊరేదో, చెరువేదో అర్థం కానంతగా వరద నీరు ముంచెత్తింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ దృశ్యాలే నిదర్శనం. దాదాపు పది అడుగులకు పైగా వరద ప్రవహించి.. ఇళ్లలోని మొదటి అంతస్తు మొత్తం నీటిలో మునిగిపోయింది. దాంతో.. ఇళ్లలోని సామానులు,…
