
స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గని కేంద్రం
సిరా న్యూస్,విశాఖపట్టణం; ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. మరోవైపు జగన్ ను ఎలాగైనా కట్టడి చేయాలని టిడిపి,జనసేన జతకట్టాయి. బిజెపి తమ వెంట వస్తే తాము అనుకున్నది సాధించగలమని భావిస్తున్నాయి. ఈ వారంలోనే బిజెపి నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి నేపథ్యంలోనే కేంద్రం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు పొత్తు పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో బీజేపీతో కలిసి నడవడంపై చంద్రబాబు, పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.గత కొద్ది సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల దృష్ట్యా బిజెపి ఈ అంశాన్ని…
