తాజా వార్తలు

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఎండలు… చంపేస్తున్న చలి

సిరా న్యూస్,విశాఖపట్టణం; చలి పులి పంజా విసరడంతో విశాఖ ఏజెన్సీ వణికిపోతోంది. పాడేరులో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది. చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏం ఉందో కనిపించడం లేదు. దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. మిచౌంగ్‌ తుఫాన్‌ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది. తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది.ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపించకపోగా, మంచు దుప్పటి కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు నానా…

Read More
16 Dec 2023, 12:41 pmsiranews.in