
వంశీరామ్ కు వరస తలనొప్పులు
సిరా న్యూస్,హైదరాబాద్; లిటిగేషన్ భూముల్లో లే అవుట్లు వేయాలంటే అది ఒక్క వంశీరాం బిల్డర్స్‌కే చెల్లు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆడిందే ఆటగా సాగించాడు వంశీరాం సుబ్బారెడ్డి. కేటీఆర్ బినామీగా ముద్ర పడిన ఈయన, గత పదేళ్లలో ఎన్నో లిటిగేషన్ భూములకు లైన్ క్లియర్ అయింది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. కానీ, ప్రభుత్వం మారడంతో సీన్ రివర్స్ అయింది. తెలంగాణ వచ్చే నాటికి బంజారాహిల్స్ 403 సర్వే నెంబర్‌లో వందల ఎకరాలు ఖాళీగా ఉంది. అందులో సుప్రీం తీర్పులతో కొంతమంది వశమైంది. కానీ, ఓ 5 ఎకరాల భూమి నిరంతరం సమస్యల సుడిగుండంలో తిరుగుతూ ఉంది. ఆ భూమిలో బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక వంశీరాం బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టింది. దీనివెనుక ఎంతో బరితెగింపు నిర్ణయాలు ఉన్నాయి. 1954 – 1955లో 403 సర్వే నెంబర్ ప్రకటించారు.…
