సిరాన్యూస్,చర్ల
అన్నిదానాల కంటే విద్యాధానం గొప్పది : వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దడ ఆశాలత
* వనవాసీ కు రూ. 20 వేల వస్తువుల వితరణ
అన్ని దానాల కంటే విద్యా దానం ఎంతో గొప్పదని వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దడ ఆశాలత అన్నారు. శుక్రవారం చర్లలోని వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్ది నిలయ చిన్నారులకు బెస్త కొత్తూరు గ్రామానికి చెందిన స్వర్గీయ నల్లూరి శ్రీనివాసరావు సతీమణి నల్లూరి దుర్గ కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని రూ. 20 విలువచేసే నిత్యవసర సరుకులతో పాటు భోజన ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా ఆశాలతో మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుంటే జీవితంలో ఉన్నతులుగా స్దితిమంతులవుతారని అన్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాలలో స్థిరపడి వారి కుటుంబాలు సైతం ఆర్థికంగా పరిపుష్టమవుతుందన్నారు. విద్యార్దులకు వితరణ అందించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా నల్లూరి దర్గ కుటుంబ సభ్యులు విద్యార్థులకు జత దుస్తులు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, సోపులు, కొబ్బరినూనె పంపిణీ చేశారు. నిలయ విద్యార్దులను ఆర్దిక సహకారం అందచేసిన నల్లూరి కుటుంబ సభ్యులకు నిలయ కమిటీ సభ్యులు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో నిలయ కమిటీ సభ్యులు జవ్వాది మురళీకృష్ణ, గోగికార్ రాంలక్ష్మణ్, గొంది ప్రసన్న, నల్లూరి చందు, నల్లూరి కుమార్, శిరీష, స్వాతి, భవాణి పాల్గొన్నారు.