Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 14 February 2024, 4:39 pmEditor : SIRA NEWS

Vasanta Panchami: ఘ‌నంగా వసంత పంచమి వేడుకలు

సిరా న్యూస్, చిగురుమామిడి

ఘ‌నంగా వసంత పంచమి వేడుకలు

చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధ‌వారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవికి ప్ర‌త్యేక పూజ‌లు చేప‌ట్టారు. అనంత‌రం పిల్లలకు అక్షరాభ్యాసం తో పాటు రాబోయే విద్యా సంవత్సరానికి నూతన అడ్మిషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆప్పాల సమ్మయ్య మాట్లాడుతూ పిల్లలు ఆయురారోగ్యాలతో చక్కటి విద్యా విజ్ఞానాన్ని అభ్యసించాలని అందుకు సరస్వతీ మాత అనుగ్రహం పిల్లలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారన్నారు. ఈరోజు మా పాఠశాలలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు మినహాయింపు ఇవ్వడం జరిగింద‌ని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కూన సంపత్, ఉపాధ్యాయులు ,విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.