Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 14 February 2024, 3:17 pmEditor : SIRA NEWS

Vasanta Panchami: వివేకానంద పాఠశాలలో వసంత పంచమి వేడుక‌లు

సిరాన్యూస్, సొనాల‌

వివేకానంద పాఠశాలలో వసంత పంచమి వేడుక‌లు
* ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

సొనాల‌లోని వివేకానంద పాఠశాలలో బుధ‌వారం వసంత పంచమి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.  అనంత‌రం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేప‌ట్టారు.  ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి చిన్నారులు వారి తల్లిదండ్రులతో హాజరై అక్షరాభ్యాసం చేయించుకున్నారు.  అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులకు పలక,  బలపం సరస్వతి దేవి ఫోటో ఉచితంగా అందించారు.   అక్షరాభ్యాసం అనంతరం తీర్థప్రసాద వితరణ చెయ్యడం జరిగింది.  ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ వసంత పంచమి యొక్క విశిష్టతను తెలియజేశారు.  అక్షరాభ్యాసం అనంతరం హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య, యాజమాన్య సిబ్బంది ఓరుగంటి ఇస్తారి, కోస్మెట్ శుద్ధోధన్, హరీష్ ఉపాధ్యాయ బృందం చుట్టూ ప్రక్క గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.