సిరాన్యూస్, ఖానాపూర్
అగ్గి మల్లయ్య దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు
ఖానాపూర్ మండల కేంద్రంలోని తర్లపాడు గ్రామంలో వెలసినటువంటి అగ్గి మల్లయ్య దేవాలయంలో సోమవారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తర్లపాడు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ని శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.