
వర్మ…త్యాగయ్యగా మిగిలిపోవాల్సిందేనా
సిరా న్యూస్,కాకినాడ; ఎన్నికల్లో త్యాగం చేశారు వర్మ. జనసేన అధినేత పవన్ కోసం తన పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకున్నారు. టిడిపి తో జనసేన పొత్తు కుదరడం, పవన్ పిఠాపురం నియోజకవర్గాన్ని కోరుకోవడం చకచకా జరిగిపోయాయి. తొలుత పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకునేందుకు వర్మ తట పటాయించారు. కానీ చంద్రబాబు చెప్పేసరికి కాదనలేకపోయారు.రాష్ట్రంలోఖాళీ అయ్యే తొలి ఎమ్మెల్సీ స్థానాన్ని వర్మతో భర్తీ చేస్తారని అప్పట్లో ప్రచారం చేశారు. ఉన్న ఒక్క మంత్రి పదవి కూడా ఆయన కోసం ఖాళీగా ఉంచినట్లు చెప్పుకొచ్చారు.కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు అయ్యాయి. అదే సమయంలో రాజ్యసభ పదవులకు సైతం కసరత్తు జరుగుతోంది.కానీ ఎక్కడ వర్మ పేరు ప్రస్తావనకు రావడం లేదు. దీంతో వర్మ అనుచరుల్లో ఒక రకమైన…
