
Vijaya Ramana Rao: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి
సిరా న్యూస్, ఓదెల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి * పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు * గృహ జ్యోతి పథకం ప్రారంభం ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు అన్నారు. గురువారం ఓదెల మండలం,రూప్ నారాయణపేట గ్రామంలో 6 గ్యారంటీల్లో భాగంగా గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలు పట్టణాల వలె అభివృద్ధి చెందుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశారని , మిగతా గ్యారంటీలు విడుదల వారిగా అమలు చేస్తామని అన్నారు. ఈనెల…
