తెలంగాణ

Vijjanna Yuva Sena: నూనె రాజ్ కుమార్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అంద‌జేత‌

సిరాన్యూస్‌, ఓదెల నూనె రాజ్ కుమార్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అంద‌జేత‌ * విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి నిరుపేద కుటుంబాలకు ఆదుకునే ఆపద్బాంధవుడీలా అల్లం వినోద్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని పెద్దమ్మ నగర్ కి చెందిన నూనె రాజ్ కుమార్ అనారోగ్యం తో మృతి చెందారు. ఈవిష‌యం తెలుసుకున్న‌ విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ చేశారు. ఈ సందర్బంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గం లోని నిరుపేద లకు ఎమ్మెల్యే విజ్జన్న పై అభిమానం తో సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో నూనె పరమేశ్వర్, మల్లేష్, మొండయ్య, నర్సయ్య, అహ్మద్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Read More
11 Sep 2024, 5:57 pmsiranews.in