సిరా న్యూస్,జగ్గయ్యపేట;
జగ్గయ్యపేట ముత్యాల గ్రామ శివారులో కెమికల్ కారుస్తున్న లారీని గ్రామస్తులు పట్టుకున్నారు. కోహిన్స్ కెమికల్ ఫ్యాక్టరీ కి సంబంధించిన లారీ గా గుర్తించారు. ముత్యాల గ్రామ పరిధిలో ఉన్న కోహిన్స్ కెమికల్ ఫ్యాక్టరీ వుంది. ఈ ఫ్యాక్టరీ వ్యర్థాలను రాత్రి వేళలో గ్రామ శివారులో వదులుతున్నారు. దీనిపై గ్రామస్థులు లబో దీబోమంటున్నారు. పక్కనే ఉన్న దొండపాడు విలేజ్ సర్పంచి ఫ్యాక్టరీలో కాంట్రాక్టు తీసుకున్నారు. లోడింగ్ చేసి చుట్టుపక్కల గ్రామాలలో రాత్రి వేళల్లో అన్ లోడు చేయడమే వారి యొక్క కాంట్రాక్టు. కోహిన్స్ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాత్రి వేళలో విపరీతమైన వాసనతో అల్లాడిపోతున్నారు. ఎన్నిసార్లు అధికారికి చెప్పిన పట్టించుకోరుంటున్నారు.