
రాజమండ్రి వైసీపీ నుంచి వివి వినాయక్..?
సిరా న్యూస్,రాజమండ్రి; మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ కు రాజమండ్రి ఎంపీ టికెట్ ఖాయం చేసింది వైసీపీ. ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. నిజానికి 2014 ఎన్నికల నుండి వినాయక్ ను ఎన్నికల బరిలో దింపే ప్రయత్నం చేస్తూ వస్తోంది వైసీపీ. అయితే ఆయన మాత్రం సున్నితంగానే తిరస్కరిస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం రాజమండ్రి ఎంపీ గా పోటీలో నిలపాలని వైసీపీ వినాయక్ పై ఒత్తిడి తెచ్చింది . కానీ ఎన్నికల ఖర్చు దృష్ట్యా ఆయన పోటీ తనవల్ల కాదని చెప్పేసినా వినాయక్ కు సీట్ ఇవ్వండి మిగిలినవి మేము చూసుకుంటాం అంటూ పార్టీ అధ్యక్షుడు జగన్ కు ఇద్దరు నిర్మాతలు హామీ ఇచ్చారని దానితో రాజమండ్రి ఎంపీ టికెట్ ఆయనకే కన్ఫర్మ్ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.సినీ ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాపుల తో సంబంధం లేని…
