
పంట కాల్వల్లోకి వ్యర్థాలు
సిరా న్యూస్,వరంగల్; ములుగు మండలం మల్లంపల్లి గ్రామ శివారులో శ్రీ అచ్యుత ఆగ్రో ఇండస్ట్రీస్ బాయిలర్ రైస్ మిల్ ఏర్పాటు కొరకు యాజమాన్యం చుట్టుపక్క రైతులకు పంట నష్టం కలిగితే నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి, తీరా రైస్ మిల్లును ఏర్పాటు చేసిన తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తూ.. బహిరంగంగానే నీటి వ్యర్థాలను సాగునీటి కాలువలలోకి మళ్లిస్తూ రైతుల పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పంట నష్టంపై యాజమాన్యం స్పందించకపోగా ప్రశ్నించిన రైతులపై దాడులు చేస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..శ్రీ అచ్యుత ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో పారా బాయిలర్ రైస్ మిల్ ఏర్పాటుచేసిన రైస్ మిల్ యజమాని నీటి శుద్ధి కోసం ట్యాంకులు నిర్మించకపోవడంతో బహిరంగ ప్రదేశంలో వ్యర్థపు నీటిని వదులుతుండటం వల్ల పంట కాలువలకు వెళ్లే నీటిలో కలుస్తూ సాగు నీరు…
