
బెంగళూరులో నీటి సంక్షోభం
సిరా న్యూస్; బోర్లు అడుగంటాయి. చెరువులు ఎండిపోయాయి. నదులు పిల్ల కాలువలను తలపిస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. ఉన్న భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అక్కడి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తెరపైకి అనేక నిబంధనలు తీసుకొచ్చింది. వాటర్ సర్వీసింగ్ సెంటర్లను మూసివేసింది. నీళ్లను అడ్డగోలుగా వాడితే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తాగే నీటికి కటకట.. స్నానం వారానికి ఒక్కసారే.. ఇది ప్రస్తుతం దేశ ఐటీ రాజధాని బెంగళూరులో నెలకొన్న పరిస్థితి.మార్చి నెలలోనే బెంగళూరు వాసులు నీళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్నారంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బోర్లు ఎండిపోవడంతో బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. స్థానికులు అవసరాల కోసం ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.…
