
Water problems ; కేసీఆర్ ఇంటికే నీటి కష్టాలు
సిరా న్యూస్,హైదరాబాద్; పది సంవత్సరాలు తెలంగాణ ఎట్లుండే. నీళ్ల తండ్లాట ఉండెన. కరెంటు కోతలు ఉండెన. కంటి నిండా నిద్ర, చేను నిండా నీళ్లు, కావలసినంత కరెంటు.. కానీ ఇప్పుడు ఎలా ఉంది? దయచేసి ప్రజలు గమనించాలి. చర్చ పెట్టాలి. పోరాటాలు చేయాలి” ఇవీ కరీంనగర్ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు. రాష్ట్రం మొత్తం ఏమో గాని.. కేసీఆర్ సొంత ఇంట్లోనే తాగునీటికి కరువు వచ్చింది. తాగునీటి ట్యాంకర్ వస్తే తప్ప అవసరాలు తీరని పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలో సాగునీటి కరువును జయించామని.. అప్పట్లో పేజీలకు పేజీలో ప్రకటనలు, పుంఖానుపుంఖాలుగా వార్తలు రాయించుకున్న కేసీఆర్.. తనే తాగునీటి కరువును ఎదుర్కొంటుండడం విశేషం. హైదరాబాదులోని నంది నగర్ లో కేసీఆర్ ఉంటున్న నివాసంలో…
