
నీటి కష్టాలు… తప్పవా
సిరా న్యూస్, విజయవాడ; రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయి. గత ఏడాది వర్షాభావ పరిస్థితులకు తోడు వచ్చిన నీటిని ప్రణాళికాబద్దంగా వినియోగించుకోకపోవడంతో జనవరిలోనే ప్రాజెక్టుల్లోని నీటిమట్టాలన్నీ ప్రమాదకర పరిస్థితుల్లోకి పడిపోయాయి. జనవరిలోనే ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అడుగంటి పోతే జూలైదాకా తాగునీటి అవసరాల సమస్య పరిష్కారం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఇప్పటికే డెడ్‌స్టోరేజ్ స్థాయికి చేరువయ్యాయి. ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 47.6 టిఎంసిలు మాత్రమే వున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 84.28 టిఎంసిలు వుండేవి. తుంగభద్ర డ్యామ్‌లో గత ఏడాది 67.75 టిఎంసిలు వుండగా, ప్రస్తుతం కేవలం 10.21 టిఎంసిలు వున్నాయి. నాగార్జునసాగర్‌లో గత ఏడాది 273.27 టిఎంసిలు వుండగా, ఈ ఏడాది కేవలం 154 టిఎంసిలు ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులో గత ఏడాది 44.2 టిఎంసిలు వుంటే…
