
వయనాడ్ విలయం
సిరా న్యూస్; గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పుకునే కేరళ విలపిస్తోంది. ఈ రాష్ట్రంపై ప్రకృతి మళ్లీ పగబట్టింది. భారీ వర్షాలకు జరిగిన విపత్తు, కేరళను ఘోరంగా దెబ్బతీసింది. భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడిన దారుణఘటనలో మృతులసంఖ్య పెరుగుతోంది. ప్రకృతి సౌందర్యానికి నిలయం దక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో కొబ్బరి చెట్లు.. నదులు.. కొండలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. దక్షిణ భారత దేశంలో ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించే రాష్ట్రం కేరళనే. అయితే ఈ కేరళపై కొన్నేళ్లుగా ప్రకృతి కన్నెర్రజేస్తోంది. కరోనా సమయంలో దేశంలోనే తొలి కేసు కేరళలోనే నమోదైంది. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళ నుంచి లక్షల మంది వివిద దేశాల్లో స్థిరపడ్డారు. ఇక వైద్య రంగంలో ఎక్కువ మంది ఉన్న రాష్ట్రం కూడా కేరళనే. అయినా ఇక్కడ వైరస్లు, వ్యాధులు విజృంభిస్తున్నాయి. కరోనా,…
