
ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తున్న అవినీతి
సిరా న్యూస్; ప్రపంచంలో తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారిపోతున్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది. అక్రమార్కులు పేట్రేగిపో తున్నారు. లంచగొండితనం రాజ్యమేలుతున్నది. ఆకలి కన్నా తీవ్రమైన సమస్యగా అవినీతి నిలబడివున్నది. లంచం ఇవ్వనిదే ఫైలు కదలనంటున్నది. ఆమ్యామ్యాల మేతతో అక్రమార్కులు బలిసిపోతున్నారు.అక్రమార్జనలే నవ్య నాగరికత అవుతున్నది. అధికారం అవినీతికి రాచబాట అయింది. కీచక రాజకీయ నాయకుల ఆదేశాలే అలిఖిత చట్టాలు అయ్యాయి. నీతిమంతుడు చేతకాని వాడుగా పరిగణించబడుతున్నాడు. అవినీతి, లంచగొండితనం అనేవి సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలుగా అవతరించాయి. అవినీతి రహిత సమాజ స్థాపనకు పూనుకోవడం, మూలాలను అన్వేషించడం, అక్రమార్కులను శిక్షించడం, చట్టాలను రూపొందించి కఠినంగా అమలుపరచడం లాంటి పలు అంశాలను చర్చించే ఐరాస వేదికగా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక…
