
political leaders : వీకెండ్ ఎమ్మెల్యేలు…
సిరా న్యూస్,అదిలాబాద్; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో పద్దతిగా ప్రజలిచ్చిన తీర్పుతో నలుగురు బీజేపీ, నలుగురు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ పది మందిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు స్థానికులే అయినా ఆ ముగ్గురు మాత్రం పక్కా నాన్ లోకల్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యేలుగా గెలిచి ఏడు నెలలైనా స్థానికంగా అందుబాటులో ఉన్నది జస్ట్ పదంటే పది రోజులు కూడా లేరన్నదీ ఆ నియోజక వర్గ ప్రజల మాట. ఎన్నికల సమయంలో తప్పితే మా నేతను చూసింది అంతంత మాత్రమే అన్నది సొంత పార్టీ క్యాడరే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. నియోజక వర్గ అభివృద్ది కోసం కలుద్దాం అంటే స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని, అత్యవసరం అయితే రాజధాని హైదరాబాద్కు పరుగులు తీయాల్సి వస్తుందని చెప్తున్నారట ఆ నియోజక…
