
నగరిలో ఏం జరుగుతోంది
సిరా న్యూస్,తిరుపతి; నగిరి లో మంత్రి రోజా చేతులెత్తేశారా? దాదాపు ఓటమి ఖాయమని ఒక అంచనాకు వచ్చారా? అందుకే సైలెంట్ గా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో నగిరి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రోజా భావించారు. కానీ సొంత పార్టీ శ్రేణులనుంచి ఆమెకు సహాయం అందలేదు. పోలింగ్ నాడే ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన గెలుపు కంటే.. ఓటమికి సొంత పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారన్నది ఆమె నుంచి వచ్చిన ఆరోపణ.అయితే ఇప్పుడు రోజా సైలెంట్ కావడం.. ప్రైవేటు ప్రాజెక్టుల శంకుస్థాపన టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేయడం.. హాట్ టాపిక్ గా మారింది.మంత్రి రోజాకు మరోసారి టికెట్ ఇవ్వద్దని సొంత పార్టీ నేతలే జగన్ ను కోరారు. కానీ విభేదాలు సమసిపోతాయని జగన్ భావించారు.…
