
కేసీఆర్ వ్యూహం ఏమిటో
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్ పాత్ర చాలా కీలకం… పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్… గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం పార్టీ కార్యక్రమాలకు… తన ఫాం హౌస్‌కు మాత్రమే పరిమితమయ్యారనే వాదన ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు అస్సలు హాజరుకావడం లేదు. ప్రస్తుత సభ కొలువుదీరిన తర్వాత ఈ 8 నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టారు కేసీఆర్. అందులోనూ ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి అసెంబ్లీకి రాగా, గత వారం జరిగిన బడ్జెట్ సమావేశాలకు మరోసారి వచ్చారు కేసీఆర్.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే కేసీఆర్‌ను సభకు…
