
గులాబీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటీ…
సిరా న్యూస్,హైదరాబాద్; భారత రాష్ట్ర సమితిలో అంతర్గతంగా అలజడి రేగుతోంది. ఊహించని విధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పడిపోయింది. ఆయన ఇంటి మందు ధర్నా చేసేందుకు బాల్క సుమన్ నేతృత్వంలో కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే.. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ... కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. దీంతో.. పార్టీ నుంచి వలసలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయన్న అభిప్రాయం కలుగుతోంది. పార్టీ ముఖ్య నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోవడంతో చాలా మంది నేతలు రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి వారిపై…
