
What is the reason for KCR’s absence?: కేసీఆర్ గైర్హాజర్ కి కారణం ఏంటీ
సిరా న్యూస్,హైదరాబాద్; మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొన్నామని వచ్చే సమావేశాల నుంచి టైగర్ వస్తుందని కాంగ్రెస్ పరిస్థితి తేలిపోతుందని కేటీఆర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా దాదాపుగా ప్రతీ రోజూ ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలను చూసిన వారంతా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం ఖాయమనుకున్నారు. కానీ కేసీఆర్ రావడం లేదు. ఒక రోజు వచ్చేస్తున్నారని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ రాలేదు. మధ్యలో నల్లగొండ సభకు హాజరు కావడంతో అనారోగ్యం కారణాన్నీ చెప్పే పరిస్థితి లేదు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ పదే పదే కార్నర్ చేస్తోంది. ఎవరు మాట్లాడినా విలువ లేదని ప్రతిపక్ష నేత రావాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీకి రాని వ్యక్తికి ప్రజలు ఎందుకు ఓట్లేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంత తీవ్రమైన దాడిని ఎదుర్కొంటున్నా కేసీఆర్ మాత్రం…
