ఆంధ్రప్రదేశ్

వలంటీర్ల ఆగ్రహానికి కారణం ఏమిటీ…

సిరా న్యూస్,తిరుపతి,  ఏపీలో వాలంటీర్లు అక్కడక్కడా తమ అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని కూడా కొన్నిచోట్ల బహిష్కరించారు. అయితే అంగన్వాడీ సమ్మెలాగా ఇది రాష్ట్రమంతా విస్తరించలేదు. కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాలంటీర్లు తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు. జీతం విషయంలో గతంలోనే వాలంటీర్లు పెద్ద ఉద్యమం చేశారు, అయినా ఫలితం లేదు. అది ఉద్యోగం కాదని, సేవ అని తేల్చి చెప్పారు జగన్. వాలంటీర్లకు నగదు అవార్డులు ప్రకటించి వారిని కాస్త శాంతపరిచారు. ఇటీవల వాలంటీర్లకు జీతాలు పెంచుతామని మంత్రి ప్రకటించినా అది అధికారికం అవునో కాదో తేలాల్సి ఉంది. ఈ దశలో వాలంటీర్లు ఆందోళనబాట పట్టారు. తమ జాబ్ చార్ట్ లోని విధులకంటే, ఎక్కువ పనులు చేయించుకుంటున్నారని అంటున్నారు. అన్ని పనులకు తమనే వినియోగిస్తున్నారని తమపై అనవసర ఒత్తిడి…

Read More
28 Dec 2023, 3:43 pmsiranews.in