
మోదీ చేస్తున్నది రాజకీయం కాదు, అది ధర్మనీతి
శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ సిరా న్యూస్,లక్నో ; ఉత్తరప్రదేశ్లోని అయోధ్య లో కొత్తగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవంపై రాజకీయ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మత పరమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ, ప్రధాని మోదీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. మోదీ చేస్తున్నది రాజకీయం (రాజనీతి) కాదని, అది ధర్మనీతి (ధర్మ మార్గం) అని అన్నారు. ‘రాజనీతి కాదు.. ధర్మనీతి. కొందరు ప్రధాని మోదీ గురించి చులకనగా మాట్లాడుతున్నారు. దానికి బీజేపీ సమాధానం చెబుతుంది. అయినా నేను ధర్మనీతికి చెందిన వాడిని. నేను చేయాల్సిందల్లా రామభక్తులకు సేవ చేయడమే. నేను ఓ పూజారిని. నాకు రాజకీయాలతో సంబంధం లేదు’ అంటూ…
