
కరీంనగర్ లో పాగా వేసింది ఎవరు..
సిరా న్యూస్,కరీంనగర్; పార్లమెంటు ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. దీంతో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమాతో ఉంది. ఇక గత ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి మరో నాలుగు అంటే మొత్తం 8 స్థానాలు గెలవాలని భావిస్తోంది. ఈమేరకు వ్యూహరచన చేస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడిన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో అయినా గెలిచి పరువు, పార్టీని కాపాడుకోవాలనుకుంటోంది. ఈమేరకు గులాబీ పార్టీ తరఫున కేసీఆర్, హరీశ్‌రావు పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు.కరీంనగర్ ఉద్యమాలకు పురిటి గడ్డ. మలి విడత తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదిన గడ్డ. రెండు దశాబ్దాలుగా కరీంనగర్ బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉంది. బీఆర్‌ఎస్ అధినేత…
