
కరీంనగర్ కాంగీరేసులో ఎవరు
సిరా న్యూస్,కరీంనగర్; కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం కసరత్తు పూర్తి చేయకముందే.. మరొక వ్యక్తి పేరు తెరమీదకు వచ్చింది. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ రావు లు టికెట్టు కోసం పోటి పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్టు వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో మరొక వ్యక్తి తీన్మార్ మల్లన్న కూడా రీంనగర్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తున్నారు. ఇదివరకు దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికి కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ఎంపికలో నెలకొన్న పీటముడి మాత్రం వీడటం లేదు. దీంతో టికెట్లు ఆశిస్తూ పోటీ పడుతున్న ఆశావాహుల్లో రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు నేతలు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియక కార్యకర్తలు తలలు…
