
మినీ ఇండియాలో గెలుపు ఎవరిది…
సిరా న్యూస్,హైదరాబాద్; మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియానే! దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ తో పాటు, బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం.. ఓట్లపరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇంకా చెప్పాలంటే అదో మినీ భారత్.. దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ఓటర్లు…
