ఆంధ్రప్రదేశ్

ఎవరికిఎర్త్.. ఎవరికిబెర్త్…

తూగోలో చర్చోపచర్చలు సిరా న్యూస్,కాకినాడ; రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయా పార్టీల అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జనసేనకు పట్టున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా టీడీపీ ఆశావహుల్లో ఒకటే టెన్షన్‌ పట్టుకుంది. ఇన్నాళ్లు ప్రజల్లో తామే అభ్యర్ధులమన్న నమ్మకంతో కష్టపడ్డ టీడీపీ నాయకుల ఆశలు గల్లంతవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుండడంతో గెలుపు దగ్గర్లోనే ఉన్నా పోటీచేసే అవకాశం లేకపోతోందంటూ తలలు పట్టుకుంటున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో జనసేన ఎగరేసుకుపోతుందని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో ఆ నియోజవర్గాల్లోని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జులు ఒకటే హైరానా పడుతున్నారు. జనసేన పార్టీకు మంచి పట్టున్న ప్రాంతం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాగా ఈ జిల్లా పరిధిలోనే మూడు స్థానాలు జనసేన పోటీచేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ…

Read More
26 Dec 2023, 12:42 pmsiranews.in