
వైసీపీ, బీఆర్ఎస్ వ్యూహాలు ఎందుకు ఫెయిలవుతున్నాయి,,,,
సిరా న్యూస్,హైదరాబాద్; రాజకీయాల్లో ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతుండడాన్ని చూస్తుంటాం. రాజకీయాలు అంటేనే ఎన్నో ఒడిదుడుకులు.. మరెన్నో సవాళ్లు. ఎప్పుడు ఎవరిని ఓటమిని వరిస్తుందో.. ఎవరికి గెలుపు వస్తుందో ఊహించడం తెలియదు. ప్రజల అంచనాలను ఊహించడం కూడా చాలా కష్టం. ఒక్కోసారి రాజకీయాల్లో కురువృద్ధులైనా.. యంగ్ స్టర్స్ చేతుల్లో ఓటమి పాలవుతుంటారు. ఇంకొన్ని చోట్ల పలుకుబడి పనిచేస్తుంటుంది. లేదంటే చేసిన సేవా కార్యక్రమాలు గెలిపిస్తాయి. కొందరి మీద సానుభూతి వర్కవుట్ అవ్వడం చూస్తుంటాం. మొత్తానికి రాజకీయాల్లో కొనసాగాలంటే ఎత్తుగడలు వేయడంతోపాటు.. ప్రత్యర్థి ఆలోచనలకు ఒక మెట్టు పైకి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఏపీలోని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిల వైఖరిపై తీవ్ర చర్చ నడుస్తోంది.తెలంగాణ రాష్ట్ర…
