
వై నాట్ 14 అంటున్న కాంగ్రెస్
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారబోతున్నాయి వచ్చే లోక్‌సభ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్లోకి వచ్చిన పార్టీ.. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మెజార్టీ సీట్లు సాధించి పట్టు తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిష్టానం కూడా కనీసం 14 సీట్లు అయినా గెలవాలని టి కాంగ్రెస్ నేతలకు టార్గెట్ పెట్టినట్టు తెలిసింది. ఆ క్రమంలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతి సభలోను 14 ఎంపీ సీట్లంటూ ప్రస్తావిస్తోంది. తెలంగాణలో మొత్తం 17 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఏ పార్టీ నేతలైనా.. ఆ ఊపులో చెప్పేటప్పుడు అన్ని సీట్లు గెలుచుకుంటామని అంటారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం 14కే ఎందుకు ఫిక్స్ అయింది? అంటే మిగతా మూడు సీట్లలో గెలవలేమని ముందే ఫిక్స్ అయ్యారా?లేదంటే వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలని అనుకుంటున్నారా అన్న…
