
ఎందుకు వినేశ్ పై వేటు…
సిరా న్యూస్; 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు వేసిన వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇవేం రూల్స్ అని అంతా పెదవి విరుస్తున్నారు. ఈ నిబంధనల విషయంలో వాళ్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు రెజ్లింగ్ ఫెడరేషన్ కూడా ఇప్పటికే వెల్లడించింది. అయితే...అంతకు ముందు రోజు రాత్రి వినేశ్ ఫోగట్ బరువు తగ్గేందుకు చాలా శ్రమించింది. కానీ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేకపోయింది. అసలు ఒలింపిక్స్‌లో ఈ బరువుకి ఎందుకంత ప్రియార్టీ ఇస్తారు..? వినేశ్ ఫోగట్ బరువు తగ్గించుకోడానికి ఎందుకంత కష్టపడింది..? అనే చర్చ కూడా జరుగుతోంది. సాధారణంగా ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు తమ ఆటను బట్టి వెయిట్ కేటగిరీలు ఉంటాయి. రెజ్లర్లు, బాక్సర్‌లతో పాటు అందరికీ ఇవి వర్తిస్తాయి. రూల్స్ ప్రకారం వాళ్లు చెప్పినంత బరువు మాత్రమే ఉండాలి. కాస్త…
