
టీడీపీకి కేశినేని గ్యాప్ ఎందుకు
సిరా న్యూస్,విజయవాడ; విజయవాడ పార్లమెంట్ స్థానం నంచి తెలుగుదేశం పార్టీ వేరే అభ్యర్థిని నిలబెడుతుందని ఈ సారికి టిక్కెట్ లేదని సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి హైకమాండ్ స్పష్టత ఇచ్చింది. పార్టీ వ్యవహారాలలో పెద్దాగ జోక్యం చేసుకోవద్దని కూడా సలహా ఇచ్చింది. నిజానికి టీడీపీ హైకమాండ్ ఇలా ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు ఎవరికీ చెప్పదు. కానీ కేశినేని నానికి మాత్రం చెప్పింది. ఈ అంశం పార్టీలో కలకలం రేపుతోంది. తిరువూరు సభ బాధ్యతను పార్టీ కేశినేని చిన్నికి ఇచ్చిన తర్వాత అక్కడ సభా ఏర్పాట్లపై కేశినేని చిన్న ఏర్పాటు చేసిన సమావేశానికి నాని వెళ్లారు. అక్కడి విషయాలు పరిధి దాటిపోయాయి. దీంతో ఏదో ఒకటి తేల్చకపోతే ఇలాంటి సమస్యలు పెరిగిపోతాయన్న ఉద్దేశంతో వెంటనే టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కేశినేని నాని వ్యవహారశైలిపై…
