Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 20 December 2023, 4:54 pmEditor : Sira News

ఆటో డ్రైవర్ భాస్కర్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాను…

నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి …

సిరా న్యూస్,బనగానపల్లె;
బనగానపల్లె పట్టణం ఈద్గానగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ భాస్కర్ గత రెండు రోజుల క్రితం నంద్యాల పట్టణం నూనెపల్లె దగ్గర జరిగిన ఆటో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. బనగానపల్లెనియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి వారి కుటుంబానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భాస్కర్ కుటుంబానికి ఎల్లవేళలా తాను అండగా ఉంటానని కాటసానిఓబుల్ రెడ్డి తెలిపారు.అనంతరం వైఎస్ఆర్ బీమా తక్షణ సాయం ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కాటసాని ఓబుల్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మూడవ గ్రామ సచివాలయంవెల్ఫేర్ అసిస్టెంట్ రవి, ఈద్గా నగర్ వైయస్సార్ పార్టీ నాయకులు కంబగిరి, మాబాషా, బోయపేట గౌండ సుబ్బయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.