ఆంధ్రప్రదేశ్

జేడీ కేజ్రీవాల్ గా మారుతారా

సిరా న్యూస్,విజయవాడ; సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ అంటూ ఆర్బాటంగా జనంలోకి వచ్చారు. ఐపీఎస్ అధికారిగా మంచి పేరు సంపాదించుకున్న వీవీ లక్ష్మీనారాయణ, ప్రజలకు ఇంకా ఏదో చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలం జనసేన పార్టీలో చేసినా... ఎక్కువకాలం ఉండలేకపోయారు. చట్టసభల్లో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏ పార్టీలో చేరకుండా సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. సొంత పార్టీతో అయినా అనుకున్న కలను నేరవేర్చుకుంటారా ? చట్టసభలో అడుగు పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన జనం ఆదరిస్తారా ? ఎన్నికల్లో ఓటు వేస్తారా…

Read More
25 Dec 2023, 11:04 amsiranews.in