
పీకే ఆశలు ఫలించేనా
సిరా న్యూస్,పాట్నా; పీకే…అలియాస్ ప్రశాంత్ కిషోర్.. దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. ఎన్నికల వ్యూహకర్తగా తెరపైకి వచ్చిన ఆయన ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలకు విజయాలను అందించారు. ఎన్నికల వ్యూహ కర్తగా విశేష సేవలు అందించారు. ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పరకాయ ప్రవేశం చేయనున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రెండేళ్ల కిందకి ఆయన జన్ సూరజ్ అనే సంస్థను ప్రారంభించారు. భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మారుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబర్ 2న పార్టీని ప్రారంభిస్తున్నానని.. పార్టీ నాయకత్వంతో పాటు విధి విధానాలను త్వరలో వెల్లడిస్తానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఐక్యరాజ్యసమితిలో పనిచేశారు. ఐదేళ్లపాటు అక్కడే…
