
సిట్ తో నిజాలు వెలుగులోకి వచ్చేనా
సిరా న్యూస్,విజయవాడ; చేసిన తప్పులు తప్పకుండా వెంటాడుతాయని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఈ కొటేషన్ వైసీపీ నేతలకు అతికినట్టు సరిపోతుంది. వైసీపీ ఐదేళ్ల పాలనతో నేతలు ఇష్టా రాజ్యంగా చెలరేగిపోయారు. సింపుల్‌గా చెప్పాలంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేయాల్సిన పనులన్నీ చేశారు. ఇప్పుడు ఇబ్బందులు పాలవుతున్నారు. తాజాగా తిరుమల వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతోందని ఓపెన్‌గా చెప్పేసింది. ఇప్పుడు వైసీపీ పెద్ద తలకాయలకు ఇబ్బందులు తప్పవన్నమాట. తిరుమల వ్యవహారంపై వైసీపీ నేతలు అడ్డంగా ఇరుక్కున్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలని జగన్ మొదలు మిగతా నేతలంతా బల్లగుద్ది మరీ చెప్పారు. జగన్ అయితే ఓ అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్రమోదీ, సీజేఐకి లేఖలు రాశారు.తిరుమల లడ్డూ వ్యవహారంపై అన్నివర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల రావడంతో చంద్రబాబు సర్కార్ రంగంలోకి దిగేసింది. సిట్ విచారణకు…
