
శాసన మండలి రద్దవుతుందా….?
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ శాసన మండలి ఉనికే ప్రమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాజ్యాంగం 171 సెక్షన్ ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళితే వెంటనే కౌన్సిల్ రద్దయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంతకీ సడన్ గా తెలంగాణ శాసన మండలికి వచ్చిన ప్రమాదం ఏంటి..? ఆయా రాష్ట్రాలు ఎగువ సభగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆర్టికల్ 169, 170, 171, 172 లో ఉన్న నిబంధనలను పాటించాలి. ఆర్టికల్ 171 ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా శాసనమండలి ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడున్న శాసన సభ్యుల సంఖ్యలో 1/3 వంతుల సంఖ్యతో కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవాలి. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 172 లో ఇదే కౌన్సిల్ ఏర్పాటు కోసం మరో నిబంధన పొందుపరిచారు. ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3 విభజించిన ఎమ్మెల్సీల సంఖ్య…
