తాజా వార్తలు

కనీసం శ్రావణంలో అయినా…

మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా  సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆషాఢం ముగిసి…శ్రావణ మాసం వస్తుండడంతో..ఉందీలే మంత్రీ కాలం ముందు ముందునా అని పాడుకుంటున్నారు. రేవంత్‌ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నెల రోజుల క్రితమే సీఎం రేవంత్‌ ఢిల్లీకి వెళ్లడం, కాంగ్రెస్‌ సీనియర్లు కూడా హస్తినకు వెళ్లడంతో.. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే కూడికలు తీసివేతలు ఓ కొలిక్కి రాలేదో ఏమో గానీ.. ఆషాఢం ఆశలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. శ్రావణంలో మంత్రి వర్గం విస్తరణ చేద్దాం, అప్పుడే చూద్దాం అని అధిష్టానం చెప్పడంతో ఈ ఆశలకు టెంపరరీగా కామా పడింది.అయితే ఇప్పుడు శ్రావణ మాసం ముంచుకొస్తున్న శుభ ముహూర్తాన ఆశావహుల్లో మళ్లీ కదలిక మొదలైంది. మంత్రివర్గ బెర్తులపై కర్చీఫులు…

Read More
31 Jul 2024, 11:28 amsiranews.in