
ప్రతిపక్ష స్థానమైనా ఉంటుందా…..
సిరా న్యూస్,హైదరాబాద్; నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు తయారైంది కేసీఆర్ పరిస్థితి. అధికారం ఉన్నపుడు ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆయన తపన చివరికి ఆయన్నే మింగేసేలా తయారైంది. 2014 నుంచి ఇతర పార్టీల్లో గెలిచిన వారిని నయానో.. భయానో బీఆర్ఎస్లో చేర్చుకుంటూ వచ్చారు. 2018లోపు దాదాపు తెలంగాణలో టీడీపీ లేకుండా చేశారు. ఈ తర్వాత 2023లోపు కాంగ్రెస్ ను కూడా ఖతం చేయాలని చూశారు. దాదాపు ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే.. రేవంత్ రెడ్డి చేతికి కాంగ్రెస్ పగ్గాలు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ప్రజలు కాంగ్రెస్ను ఆదరించారు. ప్రజలు ఇచ్చిన ఓటమిని గౌరవించకుండా అవకాశం దొరికిన ప్రతిసారీ.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. మరో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని చెప్పడం మొదలు పెట్టారు. నిజానికి సీఎం…
