
పల్లా మీదే గెలుపు బాధ్యతలు
సిరా న్యూస్,వరంగల్; జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సవాల్ గా మారింది. తన అనుచరుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డికి గ్రాడ్యుయేట్స్ టికెట్ ఇప్పించుకోగా.. తమ సన్నిహితులకు టికెట్ ఇప్పించుకోవాలని ఆశపడిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశలో పడ్డారు. దీంతో ఆయనకు పెద్దగా సపోర్ట్ చేయడం లేదనే ఆరోపణలున్నాయి.ఇటీవల నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రివ్యూ మీటింగ్ తోనే పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడగా.. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపు భారమంతా పల్లా రాజేశ్వర్ రెడ్డిపైనే పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలంతా సహాయ నిరాకరణ చేస్తుండటంతో పల్లా కూడా తనకున్న అనుభవంతో క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో కొనసాగిన ఏనుగుల రాకేశ్ రెడ్డి వరంగల్ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. ఆ…
