
గండికోటలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
సిరా న్యూస్,కడప; అంతర్జాతీయ టూరిజం మ్యాప్ లో గండికోట పర్యాటక కేంద్రానికి ప్రత్యేక స్థానాన్ని తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కడప జిల్లా గండికోట పర్యాటక కేంద్రంలో.. గండికోట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేసిన పలు నిర్మాణాలకు.. జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తోపాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, జేసీ అదితి సింగ్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ గండికోటకు ఒక చరిత్ర ఉందని ఈ ప్రాంతాన్ని రాష్ట్ర లోనే కాదు దేశంలో ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా గుర్తుండిపోయే టట్లు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పర్యాటక దినోత్సవం సందర్బంగా గండికోట ఉత్సవాలు అందరి సహకారంతో…
