
హలో రామా అంటున్న వైసీపీ నేతలు
సిరా న్యూస్,నెల్లూరు; సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద స్థాయి నాయకులకు గెలుపోటములపై భయం ఉండగా.. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆవేదనతో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు దూకుడుగా వ్యవహరించారు. ముందూ..వెనుక చూసుకోకుండా ఇక అంతా మాదే అన్నట్టు నడుచుకున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాల నుంచి.. కరోనా సేవల వరకు చాలా డబ్బులు ఖర్చు చేశారు. కానీ రోజులు నెలలుగా మారాయి.. నెలలు సంవత్సరాలయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపించాయి. కానీ ఇంతవరకు బిల్లుల చెల్లింపు లేకుండా పోయాయి. అస్మదీయ కంపెనీలకు మాత్రం రుణాలు తెచ్చి మరి చెల్లింపులు చేశారు. కానీ పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులను…
