
వైసీపీ ఎమ్మెల్యేలు…ఫిరాయింపులా
సిరా న్యూస్,నెల్లూరు; పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్తారు.. ఉండేవాళ్లు ఉంటారు. నైతికత ఉన్న వాళ్లు నాతోనే ఉంటారు " అనితో వ్యాఖ్యానించినట్లుగా పార్టీ వర్గాలు ప్రకటించాయి. హఠాత్తుగా జగన్ ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నది హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నేతలు ఇప్పటి వరకూ పార్టీ మారుతారని ఎలాంటి సంకేతాలు రాలేదు. ఫలానా పార్టీతో చర్చలు జరుపుతున్నారని ఇంకా చెప్పుకోవడం లేదు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా జగన్ పార్టీ నుంచి ఫిరాయింపుల గురించి చెప్పడం.. పోయేవాళ్లను బుజ్జగించడం.. ఆపే ప్రయత్నం చేయడం లాంటివి చేయనని చెప్పడం ఆశ్చర్యకరమే. అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం బయట ఉన్న వారికి కలుగుతోంది. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికార పార్టీలోకి వలసలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. నియోజకవర్గ అభివృద్ది కోసం పార్టీ మారుతున్నామని వాదించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా…
