Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 19 December 2023, 3:22 pmEditor : Sira News

పాత బస్తిలో యువకుడు దారుణ హత్య

సిరా న్యూస్,హైదరాబాద్;
ఐస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. . మహమ్మద్ సాదిక్ అలీ ఖాద్రి అనే యువకునిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసారు. మహమ్మద్ సాదిక్ అలీ ఖాద్రి సంఘటన స్థలంలో మృతి చెందాడు. . మృతుడు బాబా ఖాన్ ప్రాంతానికి చెందిన యువకునిగా పోలీసులు గుర్తించారు.. విషయం తెలుసుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి మనోహర్ తో పాటు చంద్రాయన గుట్ట ఏసిపి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ని హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు క్లూస్ టీం ను రంగంలో కి దింపి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.