
డ్రగ్స్ మత్తులో జోగుతున్న యువత?
సిరా న్యూస్,హైదరాబాద్; రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత నిఘా పెట్టి.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏదో ఓ చోట ఇంకా వాటి మాట వినిపిస్తూనే ఉంది. కొంతమంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చెడు వ్యసనాలకు వినియోగిస్తున్నారు. డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్‌ను ఆర్డర్ చేసి డెలివరీ తీసుకుంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఖమ్మంలో డ్రగ్స్ ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా మొట్ట మొదటి సారిగా ఖమ్మంలో హెరాయిన్ పట్టుబడింది. ఓ టెకీ అసోం నుంచి దీన్ని స్పీడ్ పోస్ట్ లో తెప్పించుకోవడం గుబులు రేపుతోంది. అయితే అతను ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావడం ఆశ్చర్యం…
