
పేదల్లో గుండెల్లో గూడు కట్టిన వైయస్సార్
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు సిరా న్యూస్,కమాన్ పూర్; పేదల గుండెల్లో గూడు కట్టుకున్న వైయస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలు మరువరని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షుడు వైనాల్ రాజు అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైనాల రాజు భాస్కర రావులు మాట్లాడుతూ పేదల కొరకు 108 వాహనం ఇందిరమ్మ గృహాలు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు తెలిసినా మనసున్న మారాజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని…
