Zero to Hero: టీ కొట్టు నుంచి… హై కోర్టు దాకా…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

టీ కొట్టు నుంచి… హై కోర్టు దాకా…

+ యువతకు స్పూర్తిదాయకంగా అడ్వొకేట్‌ గ్రహేష్‌ జీవితం
+ ఆర్థిక కష్టాలను అదిగమించి ఉన్నత చదువులు
+ నాడు ఒపెన్‌ డిగ్రీతో ఎల్‌.ఎల్‌.బీ., ఎల్,ఎల్‌.ఎం.
+ నేడు పీపీ పోస్ట్‌ను సైతం వదులుకొని స్వంత ప్రాక్టీస్‌

మనసుంటే మార్గముందని అంటారు పెద్దలు. ఆ నానుడిని నిజం చేస్తూ, తన పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా ఉన్నత చదువులు చదివి, ప్రస్తుతం న్యాయవాదిగా స్థిరపడిన బుర్రి గ్రహేష్‌ జీవితం నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. తన తండ్రికి రోడ్డు పక్కన ఉన్న చిన్న టీ కొట్టులో తాను పనిచేస్తూనే, మొక్కవోని దీక్షతో ఎల్‌.ఎల్‌.బీ., ఎల్,ఎల్‌.ఎం పూర్తి చేసారు ఆయన. మాములు టీ కొట్టు నుంచి హై కోర్టు అడ్వొకేట్‌ దాకా ఆయన ఎదిగిన వైనం ఈ రోజు సిరా న్యూస్‌ స్పెషల్‌ స్టోరీలో…

పేదరికాన్ని జయించి…
ఆదిలాబాద్‌ పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బుర్రి గంభీర్, సునీత దంపతులకు జన్మించిన బుర్రి గ్రహేష్, ఇంటర్‌ వరకు విద్యను అభ్యసించి చదువు మానేసారు. తన తండ్రికి ఉన్న టీ కొట్టులో పనిచేస్తూ, తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవారు. అయితే ఉన్నత చదువులు చదవాలని అతనికి ఉన్న సంకల్పం, అతన్ని టీ కొట్టుకు పరిమితం కానివ్వలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అంబేడ్కర్‌ ఒపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసేలా అతన్ని ముందుకు నడిపించాయి. డిగ్రీ మంచి మార్కులతో పాస్‌ కావడంతో న్యాయ విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్న గ్రహేష్, తన వద్ద దాచుకున్న కొంత డబ్బులతో హైదరబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఎల్‌.ఎల్,బీ. పూర్తి చేసి న్యాయవాది వృత్తి చేపట్టారు. న్యాయవాదిగా ప్రాక్టీస్‌ కొనసాగిస్తూనే, ఎల్‌.ఎల్‌.ఎం. పూర్తి చేసి, జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కోసం ప్రిపరేషన్‌ ప్రారంభించాడు.

పీపీ పోస్ట్‌ను సైతం కాదనీ స్వంత పాక్టీస్‌..
చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంట్టున ఎవరికైనా ప్రభుత్వం ఉద్యోగం వస్తే, ఎగిరి గంతేస్తారు. జీవితానికి ఇక చాలు అని కళ్లకు అద్దుకొని మరి ఉద్యోగం చేస్తారు. కానీ గ్రహేష్‌ మాత్రం 2021లో పబ్లిక్‌ ప్రాస్క్యూటర్‌ పోస్ట్‌కు ఎంపికైనప్పటికీ, ఉద్యోగంలో చేరలేదు. వకాలత్‌పై ఇష్టంతో తన స్వంత ప్రాక్టీస్‌నే కొనసాగిస్తూ, న్యాయశాస్త్ర రంగంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్షూ్యరెన్స్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, యునైటెడ్‌ ఇండియా ఇన్షూ్యరెన్స్‌ కంపెనీ, పాటిల్‌ మల్టిస్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్, జనతా ఎయిడెడ్‌ మ్యూచ్‌వల్లీ కో–ఆపరేటివ్‌ సొసైటీ బ్యాంక్‌లకు ప్యానెల్‌ అడ్వోకేట్‌గా సేవలందిస్తూ, పలువురి మన్ననలు అందుకుంటున్నారు. డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టులతో పాటు తెలంగాణ హైకోర్ట్‌లో సైతం కేసులు చేపడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

—————————————————————————-

కుటుంబ సహాకారంతోనే…
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన కూడ ఓడి పోకుండా ముందుకు సాగాలనే విషయాన్ని నా తలిదండ్రుల నుంచే నేర్చుకున్నాను. వారి ప్రొత్సాహం, ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చిన పట్టుదలతో చదివి అడ్వొకేట్‌గా రాణిస్తున్నాను. ప్రస్తుతం నేను ప్రతీ రోజు కోర్టు కేసుల్లో బిబీబిజీగా ఉన్నప్పటికీ నన్ను అర్థం చేసుకొని, తాను ఆదర్శ గృహిణీగా కుటుంబాన్ని చూసుకుంటున్న నా సతీమణీ వసుధ సహాకారం కూడ చాలా గొప్పది. నేను యువతకు చెప్పేది ఒకటే… కష్టాలు ఉన్నప్పుడు కుంగిపోకుండా, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఒక లక్ష్యం కోసం ముందుకు సాగిపోవడమే నిజమైన గెలుపు.

–బుర్రి గ్రహేష్, ప్రముఖ న్యాయవాది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *