
25 భారీ బహిరంగసభలకు బీజేపీ, జనసేన ప్లాన్
సిరా న్యూస్,విజయవాడ; ఎన్నికలకు దూకుడు పెంచుతోంది టీడీపీ. వచ్చే నెల(జనవరి) నుంచి భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు టీడీపీ నేత చంద్రబాబు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే)తో భేటీ అయిన చంద్రబాబు, లోకేశ్.. పీకే ప్రణాళికలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు నిర్వహించే యోచనలో ఉన్నారు చంద్రబాబు.ప్రతి బహిరంగ సభకు లక్షమంది హాజరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. చంద్రబాబు సభలకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది టీడీపీ. చంద్రబాబు 25 సభలు ఎక్కడ నిర్వహించాలి? అనే అంశంపైనా ప్రణాళిక రచిస్తున్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలు, సూచనలను అమలు పరచనుంది. జనవరిలో పూర్తి ప్రణాళికను అమలు చేయబోతున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు…
